Tuesday, July 30, 2013

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు యుపిఏ భాగస్వామ్యపక్షాలు ఏకగ్రీవం

న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు యుపిఏ భాగస్వామ్యపక్షాలు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపాయని ఆర్ఎల్డీ అధినేత అజిత్ సింగ్ చెప్పారు. యూపిఐ భాగస్వామ్య పక్షాలు మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు సమావేశమయ్యాయి. సమావేశంలో ప్రధాన భాగస్వామ్య పక్షాలు కాంగ్రెస్, ఎన్సీపి, ఆర్ఎల్డీ, నేషనల్ కాన్ఫరెన్స్ తదితర పార్టీలు పాల్గొన్నాయి. యాభై నిమిషాల పాటు భేటీ జరిగింది. తెలంగాణపై పార్టీలు అభిప్రాయాలు చెప్పాయి. ప్రధాని నివాసంలో యూపిఏ సమన్వయ కమిటీ భేటీ జరిగింది. మంచి వాతావరణం: కిరణ్ ఢిల్లీలో మంచి వాతావరణం ఉందని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మంగళవారం అన్నారు. విభజనపై ఢిల్లీ వేడెక్కిన విషయం తెలిసిందే. యూపిఏ సమన్వయ కమిటీ, సిడబ్ల్యూసి భేటీ నేపథ్యంలో కిరణ్ ఢిల్లీకి వచ్చారు. పార్టీ పెద్దలను కలిసిన అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ... తాను రాజీనామా చేస్తున్నట్లు వచ్చిన వార్తలన్నీ ఊహాగానాలే అన్నారు. ఢిల్లీలో మంచి వాతావరణం ఉందని వ్యాఖ్యానించారు.


No comments:

Post a Comment